ఏపీలో మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వస్తున్న వారిని గుర్తించి.. వారిని 14 రోజుల పాటూ హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో నమోదైన పాజిటివ్ కేసుకు సంబంధించి కీలకమైన విషయాలు తెలిసాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు ఈనెల 12 నుంచే జ్వరం ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగినట్లు తేలింది. దీంతో అధికారులు అలర్ట్ అయబాధితుడిది నగరంలోని అల్లిపురం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో రహదారులను దిగ్బంధించారు. వార్డు వాలంటీర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో కూడిన 141 బృందాలతో 28, 32, 33, 34 వార్డుల పరిధిలోని ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించారు. బాధిత రోగి కుటుంబానికి చెందిన 11 మందిని విమ్స్, ఛాతీ ఆస్పత్రుల్లోని క్వారంటైన్ వార్డులకు తరలించారు. అన్ని వీధుల్లోనూ శానిటేషన్ నిర్వహించారు.
విశాఖలో హై అలర్ట్.. ఎంత పనిచేశావ్ పెద్దాయన!